Monday, July 7, 2008

లోకం

పుట్టుక ఓ క్షణం, మరణము ఓ క్షణమే ఆ రెంటికి మధ్య కొన్ని లక్షల కోట్ల క్షణాలు, కొన్ని సంతోషాన్నినింపే తీపి గుర్తు లైతే, మరికొన్ని విషాదాన్ని ఆవేదనని కలిగిస్తాయి. ఎన్ని సుఖాలని అనుభవించినా, మరెన్నో కష్టాలని అనుభవించినా, మరణ సయ్యమీడకు చేరాక తప్పదు మనిషి. అటువంటప్పుడు ఆ జీవించిన కొంతకాలం కొన్ని విలువలతో మానవత్వంతో జీవించలేకపోతున్నాడు ఎందుకని? తన స్వార్ధం తప్ప సాటిమనిషి ఆవేదనని అర్ధం చేసుకోలేకున్నాడు?కళ్ళ ముందు ఎదుటివాడు కష్టం లో వున్నా కనికరం చూపలేకున్నాడు .బహుశా ఈ యాంత్రిక జీవనంలో మనిషికూడా యంత్రంలా మారిపోయాడా ?మనసన్నదే లేకుండా ఇలా మిగిలి వున్నాడా?? మనిషి నిలువెల్ల స్వర్ధాన్నే నింపుకొని జీవిస్తున్నాడా???????????????ఇలాంటి అనేక ప్రశ్నలతో నిత్యం నా మనసు సతమతమవ్వుతోంది .అందరిలోనూ స్వార్ధం అడుగడుగునా స్వార్ధం ప్రతిపనిలోను స్వార్ధం .దీనికి నేను అతీతం అని చెప్పట్లేదు ,నేను కొన్ని విషయాలలో స్వర్ధపరురాలినే ! స్వార్ధంగా ఆలోచించే నేనంటే నాకు ద్వేషమే ! మానవత్వం మచ్చుకైనా కానరాని ఈ లోకం నాకొద్దు .అందరి మనసులలోని స్వర్ధమనే భూతాన్ని తొలగించి నిస్వార్ధం, ఆత్మీయతానురాగాలతో, మానవతా విలువలతో నిండిన నిర్మల మనస్కులైన మనుషులతో నిండిన సరికొత్త లోకాన్ని సృష్టించు పరంధామా

No comments: