పువ్వు లోని మధువుని గ్రోలే తుమ్మెదవై నా అధరామృతాన్ని గ్రోలగా
మంచు బిందువు తోలి చుమ్బనానికి పరవశించిన గులాబీని అవ్వనా
రెండు కొండల నడుమ ఉదయించే సుర్యునివై నీవుండగా
నీ నులి వెచ్చని కిరణాల తాకిడికి వికసించే పువ్వు నే నవ్వనా
నీ వెలుగు పెంచు మరింత ప్రజ్వరిలుతు కొండలనుంచి దూరమై నే తెలనా చేరుటకై
మరింత ఎత్తు పెరిగి నిన్ను చేరనా నీ సరస సల్లపపులలో మునిగి నే తేలన
Thursday, January 14, 2010
Wednesday, November 12, 2008
నా ఆత్మీయ నేస్తమా ..........................
సూర్యోదయం సూర్యాస్తమయం రెండూ చూడడానికి ఎంతో అందంగానే వుంటై కాని ఒకటి లోకానికి వెలుగు రేఖలు పంచడానికి వస్తే మరొకటి లోకాన్ని గాడాంధకారంలో ముంచి వెళ్ళిపోతుంది అలాగే నిన్ను కలవడం అంటే నాకు ఇష్టం కానీ నన్ను వీడి నీవు దూరంగా వెళ్ళేటప్పుడు మాత్రం కాదు .........ప్రతి సూర్యాస్తమయం మరో సూర్యోదయానికి శ్రీకారం అయ్యినట్టు ..........మనం మళ్లీ కలుస్తాం ఏమో కానీ .....నేను ఆ సూర్యాస్తమయాన్ని చూడటానికి సిద్దంగా లేనట్టే నను వీడి పోయే క్షణాన నిన్ను చూడలేను ......................ఎప్పటికి సూర్యోదయం కోసమే వేచి వుంటాను ................................మన స్నేహంలో సూర్యోదయం లాంటి ఆనందమయ క్షణాల్ని తప్ప సూర్యాస్తమయం లాంటి ఆవేదనాభరిత క్షణాన్ని ఊహలో సైతం రానీయలేను మిత్రమా .................నా ఆత్మీయ నేస్తమా ..........................
Monday, September 22, 2008
Wednesday, September 17, 2008
Subscribe to:
Posts (Atom)