Tuesday, July 29, 2008

ఎదురుచూపు

చల్లగా చిరుగాలి నను పలకరించెనే
తోలి చినుకే ఆప్యాయాంగా నను ముద్దాడేనే
మదిని మురిపించే సంగీతం చెవికి వినిపించెనే
మనసే ఉల్లాసంతో ఉప్పొంగి పోయెనే ...................
ఆఆఆఆఆఅ క్షణాన ఎదురుగా నిను నే వీక్షించగా
మదిలోని ఊహలకే రూపమే నీవై నా ఎదుట సాక్షత్కరించగా
నిను చేరాలనే ఆత్రుతలో ఉలికిపడి నే కన్నులను తెరువగా
నాకలోని నీరూపం మంచు శిల్పం వలె కరిగిపోగా
ఎంతగా విలపించితినో తెలుసునా ప్రియతమా ......................నీకై ఎంతగ వేచిఉంటినో, ఇక ఆటలు చాలించి నా కనులముందు కనిపించవా .........నీ కౌగిలిలో ఇన్నాళ్ళ వేదనంత కన్నీటిగా కరిగించ రావా
ఎంత కష్టం వచ్చినా మోముపై నవ్వుని చెరగనీకు మిత్రమా ,అది వెలుగై నీకు దారిచూపుతుందిగా

Wednesday, July 16, 2008

అనూష

ప్రతినిత్యం నను మేలుకొలిపే అనూష కిరణానివే
నీ పలుకులతో దరహాసం వికసింప చేస్తావే
చిలిపితనం నీ నయనాల దాచినావే
నాకన్నా సంపన్నుల్ల్లెవ్వరున్నారే
పొందితిని కాదా నీ స్నేహ నిధిని నేనే
చిరుకాలం లోనే చిరకాల నేస్తమే అయినావే

నీలిమ

నీలాకాసంలో వర్ణాఎలేన్ని మారినా
ఎన్నెన్నో వసంతాలు గడచినా
మన చిలిపితనం మారునా
చేసిన అల్లరి జ్ఞాపకాలని వీడునా
నీలాంబరంలో ఎప్పటికి మనం స్నేహపు స్వేచ్ఛా విహంగాలై విహరిద్దాం మిత్రమా
ఎన్నటికి వసివాడక పరిమళాలను వెదజల్లే పుష్పం పేరే స్నేహమా.........

Tuesday, July 8, 2008

నా స్నేహం

కన్నీరుండదు నా స్నేహంలో చిరునవ్వులు తప్ప
స్వార్ధం వుండదు నా స్నేహంలో స్వచ్చత తప్ప
కల్మషం వుండదు నా స్నేహంలో కారుణ్యం తప్ప
ఏమీ పంచలేను నీకు నే స్నేహం తప్ప

నా దుఖాన్ని నాలోనే దాచి నే చిరునవ్వులో పంచుతాను మిత్రమా ఎందుకంటే నీ దుఖం నే చూడలేను నా దుఖం చూసి నీవు తాళలేవు
అమృతానికి మరోపేరు అమ్మ
అనురాగాన్ని కురిపించేది అమ్మ
ఆత్మీయతను పంచేది అమ్మ
కలతైవున్నప్పుడు కన్నీటిని తుడిచేది అమ్మ
కలలో సైతం నీ సంతోషం కై తపిస్తుంది అమ్మ
తన ఒడినే బడిగా చేసే తోలి గురువే అమ్మ
నిరంతరం నీకై శ్రమించే అలుపెరుగని శ్రామికురాలే అమ్మ
కోరినవన్నీ అందించే అమృతమయి అమ్మ
నాకో ప్రియనేస్తం మా అమ్మ.....................ఐ లవ్ యు అమ్మ

స్వేచ్ఛ

గూటిలో చిలకమ్మ గుబులుగా కూర్చుంది
నింగిలో స్వేచ్ఛగా ఎగిరేటి పక్షినే చూస్తోంది
తన గోడు వినమంటు ఆర్తిగా అరిచింది
ఆ గోడు మనిషికి వినిపించేనా
ఈ చిలకమ్మకు స్వేచ్చ లభించేనా

Monday, July 7, 2008

లోకం

పుట్టుక ఓ క్షణం, మరణము ఓ క్షణమే ఆ రెంటికి మధ్య కొన్ని లక్షల కోట్ల క్షణాలు, కొన్ని సంతోషాన్నినింపే తీపి గుర్తు లైతే, మరికొన్ని విషాదాన్ని ఆవేదనని కలిగిస్తాయి. ఎన్ని సుఖాలని అనుభవించినా, మరెన్నో కష్టాలని అనుభవించినా, మరణ సయ్యమీడకు చేరాక తప్పదు మనిషి. అటువంటప్పుడు ఆ జీవించిన కొంతకాలం కొన్ని విలువలతో మానవత్వంతో జీవించలేకపోతున్నాడు ఎందుకని? తన స్వార్ధం తప్ప సాటిమనిషి ఆవేదనని అర్ధం చేసుకోలేకున్నాడు?కళ్ళ ముందు ఎదుటివాడు కష్టం లో వున్నా కనికరం చూపలేకున్నాడు .బహుశా ఈ యాంత్రిక జీవనంలో మనిషికూడా యంత్రంలా మారిపోయాడా ?మనసన్నదే లేకుండా ఇలా మిగిలి వున్నాడా?? మనిషి నిలువెల్ల స్వర్ధాన్నే నింపుకొని జీవిస్తున్నాడా???????????????ఇలాంటి అనేక ప్రశ్నలతో నిత్యం నా మనసు సతమతమవ్వుతోంది .అందరిలోనూ స్వార్ధం అడుగడుగునా స్వార్ధం ప్రతిపనిలోను స్వార్ధం .దీనికి నేను అతీతం అని చెప్పట్లేదు ,నేను కొన్ని విషయాలలో స్వర్ధపరురాలినే ! స్వార్ధంగా ఆలోచించే నేనంటే నాకు ద్వేషమే ! మానవత్వం మచ్చుకైనా కానరాని ఈ లోకం నాకొద్దు .అందరి మనసులలోని స్వర్ధమనే భూతాన్ని తొలగించి నిస్వార్ధం, ఆత్మీయతానురాగాలతో, మానవతా విలువలతో నిండిన నిర్మల మనస్కులైన మనుషులతో నిండిన సరికొత్త లోకాన్ని సృష్టించు పరంధామా
నే కలలో గాంచితి నిన్నే
నా ఆశకు ప్రాణం నీవే
నా ఊహకు రూపం నీవే నా ప్రియా........

నీవే చెంతన వుంటే చిరునవ్వే విరియును మూముపై
నీవే కనపడకుంటే క్షణమే యుగంయ్యేను నాకు


అల్లరిగా నను చేరే చిరుగాలి పాటవి నీవైతే
ఆ గానానికి పరవశించి నర్తించే చిరు పైరుని నే కానా
పుష్పమును చుంబించి మధువును గ్రోలే తుమ్మేదవి నీవైతే
ఆ చుంబనానికి సిగ్గుతో తల వాల్చే పుప్ష్పాన్ని నే కానా


అహో ఏమి సౌందర్యము దాగి వున్నది ఈ ప్రకృతిలో ఎంత రమణీయత ఎంత ఆస్వాదించిన తనివి తీరని ఈ ప్రకృతి సౌందర్యానికి ముగ్దుదవ్వని మనీషి లేదంటే అతిశయం లేదేమో . ఉషోదయ వేళ ఆ ఉదయ భానుని లో ఊఁ అద్బుతం ,పూచే పూవులలో , ఆ పూల పరిమళాలలో ఓ గమ్మత్తు ,కోకిల గానం లో ని తేనెలొలుకు రాగం .పచ్చని చీరకట్టి ఆకాసంలో అందంగా విహరించే చిలమ్మ సౌందర్యం .హోయలోలికే జలపాతాలు ,ఎగసి పడే కెరటాల సవ్వడి , ఇలా ఎన్నో ఎన్నెన్నో...........చూసి ఆస్వదిన్చాలే కానీ ................ఆ అతి సుందర ప్రకృతి కాంతను వర్ణించుటకు.....................భాష లేదు ......................

నీ పలుకులతోనే ఆలపించావే సుప్రభాతం
నీ చూపులతోనే రాసావు కవితలెన్నో
నీ నవ్వుల లోనే నింపావు సప్తస్వరాలే
నిను చూస్తూ వుంటే మదిలోనే పొంగే కవిత

మాటే మౌనమైన వేళలో మనసు పాడే గీతం ఇది ,
ఆలకించ లేదా నా మౌన గీతం ప్రియతమా......
పెదవులు పలుకలేని భావం కన్నులలో పలికిన్చ్చాను నేస్తం ,
అవగాతమవ్వలేదా ఆ సవ్వడి లేని నా భావం.........

మనసు స్పందన నుంచి జనించు భావమే కవిత
జీవితమనే పూదోటలో అందమైన గులాబిని నేనయితే
దానికి స్నేహమనే సుగంధ పరిమళాన్ని అందించింది నీవు
స్వాతి చినుకువి నీవైతే
ఆ చినుకు పది ముత్యంగా మారిన ఇసుక రేనువుని నేనవుతా
హోయలోలికే సెలఎటివి నీవైతే
గలగలమనే మృదు మధుర సవ్వడిని నేనవుతా
శీతాకాలపు మంచు బిండువువి నీవైతే
ఆ బిందువు పది అందం ఇనుమడింప బడిన గులాబిని నేనవుతా
స్నేహ పుష్పం లో మకరందానివి నీవైతే
ఆ మకరందాన్ని గ్రోలే తుమ్మేదని నేనవుతా
స్నేహమనే ఆకాశం నీవైతే
అందులో స్వేచ్చగా విహరించే విహంగాన్ని నేనవుతా
ఆకాసంలో చంద్రుడివి నీవైతే
నీ సాంగత్యం కోరే తారకని నేనవుతా
నీలాకాసం లో నేలరాజువి నీవైతే
ఆహ్లాద పరిచే వెండి వెన్నెలని నేనవుతా
వేనువువి నీవైతే
అందులోంచి కమ్మని రాగాలని పలికించే గాలిని నేనవుతా
లేలేత మామిడి చిగురువి నీవైతే
అది చూసి కమ్మగా పడే కోయిల నేనవుతా
సాగారానివి నీవైతే
నీలో సంగామించాలని పరుగులు తీసే నదిని నేనవుతా
అందమైన పుష్పానివి నీవైతే
నీతో చెలిమిని చేసే సీతాకోకచిలుకని నేనవుతా
నా చెలిమికోసం ఆకసం నుంచి జాలువారే చినుకువి నీవైతే
నీ స్పర్శచే పులకరించిన పుడమినుంచి వెలువడే సుగంధ పరిమళాన్ని నేనవుతా
తొలకరి చినుకువి నీవైతే
పురివిప్పి నర్తించే నెమలిని నేనవుతా
బాధతో నిండిన మనసువి నీవైతే
కనులు వర్షించే కన్నీటిని నేనవుతా
ఉల్లాసంతో వుప్పొంగేది నీవైతే
పెదవులపై విరబూసే చిరునవ్వుని నేనవుతా
ఉదయభానుని కిరణాలతో ఆటలాడే వర్షపు చినుకువి నీవైతే
సప్త వర్ణ శోభితమైన ఇంద్రధనుసుని నేనవుతా

మనసులోని భావాన్ని కాగితంపై అక్షరాలుగా మలచితే కవితైతే ,నా కవితకు ఊపిరి నీవే నా ప్రియ నేస్తం ,నీకే నా ఈ కవితలు అంకితం ......................
ఏమిటా వెలుగు అని నిన్నే చూస్తున్న
అది నా చెంతకే వచ్చి నిలుచుంటే మైమరచి పోతుఉన్న
కలలో నే వున్నానేమో అని నన్ను గిల్లి చూసుకున్న
కాదు అని తెలిసి నే మురిసిపోతున్న